యూపీ యోధ గెలుపు | UP Yoddha edge out Haryana Steelers | Sakshi
Sakshi News home page

యూపీ యోధ గెలుపు

Dec 7 2018 9:50 AM | Updated on Dec 7 2018 9:50 AM

UP Yoddha edge out Haryana Steelers - Sakshi

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ పాయింట్‌ తేడాతో గట్టెక్కింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో యూపీ యోధ 30–29 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యోధ జట్టులో శ్రీకాంత్‌ జాదవ్‌ (8), ప్రశాంత్‌ (8), సచిన్‌ (6) రాణించారు. హరియాణా తరఫున మోను గోయట్‌ (11), వికాస్‌ (7) ఆకట్టుకున్నారు.

మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 37–33తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో మిరాజ్‌ షేక్‌ 9, నవీన్‌ కుమార్‌ 8 పాయింట్లు చేశారు. తలైవాస్‌ జట్టులో అజయ్‌ ఠాకూర్‌ (14) రాణించగా... సుకేశ్, అతుల్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. శుక్రవారం నుంచి మ్యాచ్‌లు వైజాగ్‌లో జరుగనున్నాయి. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్‌ తలపడతాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement