క్రికెట్‌ చరిత్రలో ఈరోజు...

West Indies 1975 World Cup win 43 Years Completed - Sakshi

క్రికెట్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు. క్లైవ్‌ లాయిడ్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌ జట్టు తొలి ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తి నేటికి సరిగ్గా 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఐసీసీఐ ఓ ట్వీట్‌ ద్వారా ఆ మధుర క్షణాలను గుర్తు చేసింది. మొదటి క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను ఇంగ్లాండ్‌లో 1975లో నిర్వహించారు. మొదటి టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, భారతదేశం, న్యూజీలాండ్, శ్రీలంక మరియు వివిధ దేశాల ఆటగాళ్లతో కూడిన సంయుక్త తూర్పు ఆఫ్రికా జట్టు మొత్తం 8 టీమ్‌లు పాల్గొన్నాయి. జాతివివక్ష కారణంగా దక్షిణాఫ్రికాను ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈ జట్టును బహిష్కరించారు. లార్డ్స్‌ వేదికగా జూన్‌ 21వ తేదీన(1975) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు నిర్ణీత 60 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 58.4 ఓవర్లలో 274 పరుగులకు అలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ 102 పరుగుల ఇన్నింగ్స్‌తో(ఓ వికెట్‌ కూడా తీశారు) విండీస్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top