ఫైనల్లో విష్ణు జంట | Vishnu is in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో విష్ణు జంట

Jul 22 2017 12:34 AM | Updated on Sep 5 2017 4:34 PM

ఫైనల్లో విష్ణు జంట

ఫైనల్లో విష్ణు జంట

ప్రెసిడెంట్స్‌ కప్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌

హైదరాబాద్‌: ప్రెసిడెంట్స్‌ కప్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో శుక్రవారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌ (భారత్‌)–తొషిహిదె మత్సుయ్‌ (జపాన్‌) ద్వయం 7–6 (7/5), 7–6 (7/1)తో సాడియో దుంబియా (ఫ్రాన్స్‌)–కనెక్ని (చెక్‌ రిపబ్లిక్‌) జంటపై విజయం సాధించింది.

గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జోడీ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్‌ మొత్తంలో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోగా... టైబ్రేక్‌లో మాత్రం విష్ణు జంటదే పైచేయిగా నిలిచింది. శనివారం జరిగే ఫైనల్లో కర్లోవ్‌స్కీ–తుర్నెవ్‌ (రష్యా) జోడీతో విష్ణు–మత్సుయ్‌ ద్వయం తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement