సెహ్వాగ్‌(vs)అక్తర్‌ | Virender Sehwag and Shoaib Akhtar to lock horns in ice cricket | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌(vs)అక్తర్‌

Nov 23 2017 12:11 AM | Updated on Nov 23 2017 12:11 AM

Virender Sehwag and Shoaib Akhtar to lock horns in ice cricket - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్, పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ల మధ్య మళ్లీ బ్యాట్, బాల్‌ పోరు జరగనుంది. కానీ ఈసారి క్రికెట్‌ గ్రౌండ్‌లో కాదు... ఐస్‌ క్రికెట్‌లో! శీతల దేశమైన స్విట్జర్లాండ్‌ ఈ ఆసక్తికర పోరుకు వేదికైంది. సెయింట్‌ మోరిట్జ్‌లో ఈ ఐస్‌ క్రికెట్‌ జరగనుంది. అయితే అక్కడ ఐస్‌ క్రికెట్‌ కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే 1988లో ఈ ఆట మొదలైంది. కానీ అంతర్జాతీయ స్టార్స్‌ మాత్రం ఇందులో ఎన్నడూ తలపడలేదు.

ఇప్పుడు ఈ చిరకాల ప్రత్యర్థులతో పాటు కైఫ్‌ (భారత్‌), జయవర్ధనే, మలింగ (శ్రీలంక), హస్సీ (ఆసీస్‌), స్మిత్, కలిస్‌ (దక్షిణాఫ్రికా), వెటోరి, నాథన్‌ మెకల్లమ్, ఎలియట్‌ (కివీస్‌), పనేసర్, ఓవైస్‌ షా (ఇంగ్లండ్‌) తదితరులు మ్యాటింగ్‌ పిచ్‌పై హంగామా చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగే ఐస్‌ టి20 మ్యాచ్‌ల్లో ఆడేందుకు వీరూ లాంటి స్టార్స్‌కు రూ. 32.50 లక్షలు (50 వేల డాలర్లు), మిగతా వారికి 19.50 లక్షలు (30 వేల డాలర్లు) పార్టిసిపేషన్‌ ఫీజుగా చెల్లిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement