సెహ‍్వాగ్‌ను మార్చేశా! | Virat Kohli has replaced Virender Sehwag as my favourite cricketer, says Dean Jones | Sakshi
Sakshi News home page

సెహ‍్వాగ్‌ను మార్చేశా!

Published Thu, Nov 30 2017 11:21 AM | Last Updated on Thu, Nov 30 2017 11:22 AM

 Virat Kohli has replaced Virender Sehwag as my favourite cricketer, says Dean Jones - Sakshi

బ్రిస్బేన్‌:ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద సృష్టిస్తూ వరుస రికార్డులను కొల్గగొడుతున్న భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ కూడా చేరిపోయాడు. గత నెల్లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో విరాట్‌ కోహ్లి చేసిన సెంచరీని ఎగతాళి చేసిన డీన్‌ జోన్స్‌.. తాజాగా తాను విరాట్‌ కోహ్లికి అభిమానిని అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. దూకుడుగా ఆడే కోహ్లి స్వభావమే అతనికి తనను అభిమానిని చేసిందంటూ పేర్కొన్నాడు.

తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లి నా అభిమాన ఆటగాడిగా మారిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఎందుకంటే కోహ్లికి ముందు నేను సెహ్వాగ్‌ అభిమానిని. దూకుడుగా ఆడే కోహ్లి  స్వభావం నాకు ఎంతో నచ్చుతుంది. ఎలాంటి పిచ్‌పైన అయినా అతడు సులువుగా పరుగులు రాబడతాడు. కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడిని కోచ్‌ రవిశాస్త్రి బయటకు తీశాడు. నేను సెహ్వాగ్‌ నుంచి కోహ్లికి మారిపోయా'అని డీన్‌ జోన్స్‌ పేర్కొన్నాడు.గత నెలలో న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీని  ఎగతాళి చేస్తూ డీన్ జోన్స్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి ఆట బాగుంది. కానీ మళ్లీ అది న్యూజిలాండ్ పైనే సెంచరీ చేశాడు అంటూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement