'టాప్' ముంగిట టీమిండియా! | virat kohli gang a win away from number one rank | Sakshi
Sakshi News home page

'టాప్' ముంగిట టీమిండియా!

Aug 16 2016 1:03 PM | Updated on Sep 4 2017 9:31 AM

'టాప్' ముంగిట టీమిండియా!

'టాప్' ముంగిట టీమిండియా!

వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా మరో ఘనతను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.

గ్రాస్ ఐలెట్:వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా మరో ఘనతను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. విండీస్తో జరిగే చివరి టెస్టును భారత క్రికెట్ జట్టు గెలిస్తే టాప్కు చేరే అవకాశం ఉంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా తన రెండో స్థానాన్ని, ఆస్ట్రేలియా ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. కాగా, విండీస్తో గురువారం నుంచి జరిగే టెస్టు మ్యాచ్ను భారత జట్టు గెలిచిన పక్షంలో నంబర్ ర్యాంకుకు చేరుతుంది.


మరోవైపు పాకిస్తాన్- ఇంగ్లండ్ల జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగియడంతో ఆయా జట్ల ర్యాంకింగ్స్లో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ మూడో ర్యాంకులో ఉండగా, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. కాగా, ఆసీస్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు డ్రాగా ముగిస్తే పాకిస్తాన్ రెండో స్థానానికి ఎగబాకుతుంది. అప్పుడు ఆసీస్ మూడో స్థానానికి పడిపోక తప్పదు. ఒకవేళ చివరి మ్యాచ్ ల్లో  లంకపై ఆసీస్ గెలిచి, టీమిండియాపై విండీస్ గెలిచినా, డ్రా చేసుకున్నా ర్యాంకింగ్స్ల్ లో మార్పు ఉండదు. ఇదిలా ఉండగా, ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో భారత టాపార్డర్ ఆటగాడు అజింక్యా రహానే ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపరుచుకుని కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement