మంజోత్‌ హాఫ్‌​ సెంచరీ | Under 19 Cricket World Cup Final Updates | Sakshi
Sakshi News home page

Feb 3 2018 8:32 AM | Updated on Feb 3 2018 12:09 PM

Under 19 Cricket World Cup Final Updates - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ :  అండర్‌ వరల్డ్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లో భారత లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్‌ కోల్పోయి 110 పరుగులు చేసింది. మంజోత్‌ కల్రా 50 పరుగులు, గిల్‌ 21 పరుగులు సాధించారు. మరో ఓపెనర్‌ షా 29 పరుగుల వద్ద సథర్‌ల్యాండ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్‌ ఆలౌట్‌ అయ్యింది.  ఓపెనర్లు త్వరగా అవుటయినా తర్వాత వచ్చిన మెర్లో మాత్రం రాణించాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ సాధించిన మెర్లో.. 76(102 బంతులు) పరుగుల వద్ద రోయ్‌ బౌలింగ్‌లో శివసింగ్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి ఆసీస్‌ పతనం వేగం పుంజుకుంది.ఒకదశలో నిలకడగా సాగుతున్న ఆసీస్‌ బ్యాట్స్‌ మన్లను భారత బౌలర్లు ఒక్కసారిగా దెబ్బకొట్టారు. చివర్లో 5 వికెట్లను ఆస్ట్రేలియా జట్టు త్వరగా కోల్పోయింది.

ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ లలో ఉప్పల్‌ 34 పరుగులు, ఎడ్వర్డ్స్‌ 28, షరమ్‌ స్వీనే23 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్‌ మావి ఓ వికెట్‌ తీశాడు. మరో ఆటగాడు (హోల్ట్‌) రనౌట్‌​ గా వెనుదిరిగాడు.

Advertisement
 
Advertisement
Advertisement