సౌరాష్ట్రను గెలిపించిన జడేజా | Ton-up Ravindra Jadeja keeps Saurashtra in hunt for quarter-final berth | Sakshi
Sakshi News home page

సౌరాష్ట్రను గెలిపించిన జడేజా

Feb 12 2018 4:45 AM | Updated on Feb 12 2018 4:45 AM

Ton-up Ravindra Jadeja keeps Saurashtra in hunt for quarter-final berth - Sakshi

రవీంద్ర జడేజా

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా విజయ్‌ హజారే ట్రోఫీలో చెలరేగాడు. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్‌తో జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జడేజా (116 బంతుల్లో 113 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్రను గెలిపించాడు. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసి విజయం సాధించింది.

సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌ రాబిన్‌ ఉతప్ప (17 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్‌ పుజారా (44; 6 ఫోర్లు), చిరాగ్‌ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. ఐదో వికెట్‌కు చిరాగ్‌తో కలిసి జడేజా 114 పరుగులు జతచేశాడు. అంతకుముందు జార్ఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (93; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీని చేజార్చుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్‌ ఉనాద్కట్, చిరాగ్, శౌర్య రెండేసి వికెట్లు తీశారు. గ్రూప్‌ ‘డి’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 45 పరుగులతో విదర్భపై, జమ్మూ కశ్మీర్‌ ఐదు వికెట్లతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.   

Advertisement
 
Advertisement
Advertisement