తెలుగు టైటాన్స్‌కు  మూడో గెలుపు | Third victory for Telugu Titans | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌కు  మూడో గెలుపు

Oct 20 2018 1:40 AM | Updated on Oct 20 2018 1:40 AM

Third victory for Telugu Titans - Sakshi

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 35–31తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్‌ 14–17తో వెనుకబడింది. రెండో సగంలో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి చెలరేగడంతో టైటాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా... తెలుగు టైటాన్స్‌ 30–31తో వెనుకంజలో ఉంది.

ఆ సమయంలో రైడింగ్‌కు వచ్చిన పట్నా కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ను టైటాన్స్‌ ఆటగాళ్లు పట్టేయడంతో 32–31 తో నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కాపాడు కుంటూ జాగ్రత్తగా ఆడి విజయం సొంతం చేసుకుంది. టైటాన్స్‌ తరఫున రాహుల్‌ చౌదరి (7 పాయింట్లు), నీలేశ్‌ (5 పాయింట్లు) రైడింగ్‌లో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో విశాల్‌ (6 పాయింట్లు) రాణించా డు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌ 29–25తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో బెంగాల్‌ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో యు ముంబా తలపడనున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement