విజయంతో టైటాన్స్‌ వీడ్కోలు | Telugu Titans Beat 41-36 UP Yodha | Sakshi
Sakshi News home page

విజయంతో టైటాన్స్‌ వీడ్కోలు

Oct 10 2019 4:29 AM | Updated on Oct 10 2019 4:29 AM

Telugu Titans Beat 41-36 UP Yodha - Sakshi

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ను తెలుగు టైటాన్స్‌ జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 41–36తో యూపీ యోధపై విజయం సాధించింది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ చక్కగా రాణించాడు. 15 సార్లు రైడింగ్‌ వెళ్లిన అతను 15 పాయింట్లు తెచి్చపెట్టాడు. మిగతా వారిలో కృష్ణ మదనే, ఫర్హాద్‌ చెరో 4 పాయింట్లు సాధించారు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్‌ జాదవ్‌ (8), రిషాంక్‌ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్‌ (5), మోను గోయత్‌ (4), నితీశ్‌ కుమార్‌ (4) రాణించారు. మొత్తం మీద 22 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ 6 విజయాలతో 11వ స్థానంలో నిలిచింది. 4 విజయాలతో తమిళ్‌ తలైవాస్‌ అట్టడుగున నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 33–29తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. నేడు (గురువారం) జరిగే పోటీలో యు ముంబాతో హరియాణా స్టీలర్స్‌ తలపడుతుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement