తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(456/9) | team india lose 9th wicket | Sakshi
Sakshi News home page

తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(456/9)

Jan 9 2015 8:53 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీతో  ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ,  సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది.
 
అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం టీమిండియా 456 పరుగులకు తొమ్మిది వికెట్లను కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement