టీమిండియానే నెంబర్ వన్ | Team India, Ashwin head ICC Test rankings | Sakshi
Sakshi News home page

టీమిండియానే నెంబర్ వన్

Oct 26 2016 4:37 PM | Updated on Sep 4 2017 6:23 PM

టీమిండియానే నెంబర్ వన్

టీమిండియానే నెంబర్ వన్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలర్ల జాబితాలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ తాజా జాబితాను బుధవారం ఐసీసీ విడుదల చేసింది.

భారత్ 115 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (111), ఆస్ట్రేలియా (108) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి.

న్యూజిలాండ్తో సిరీస్లో రాణించిన 200 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్స్టర్ డేల్ స్టెయిన్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్లో ఉండగా, మరో భారత స్పిన్నర్ జడేజా ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాట్స్మెన్ జాబితాలో భారత ఆటగాడు అజింక్యా రహానె ఆరో ర్యాంక్ సాధించాడు. పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా 15, 17 స్థానాల్లో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement