
మెల్‌బోర్న్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిసిన తర్వాత బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అలాంటి వివాదానికి అవకాశం ఇవ్వకుండా ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త నిబంధనతో ముందుకు వచి్చంది. మ్యాచ్‌లో స్కోర్లు సమమై, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిస్తే ఆ వెంటనే రెండో సూపర్ ఓవర్ కూడా ఆడిస్తారు. అందులో కూడా ఇరు జట్లు సమంగా నిలిస్తే మరో సూపర్ ఓవర్ కూడా ఆడాల్సి ఉంటుంది. తుది ఫలితం తేలే వరకు దీనిని కొనసాగిస్తారు. ఫుట్‌బాల్, హాకీ పెనాల్టీ షూటౌట్‌లలో స్కోరు సమమైతే ఫలితం తేలే వరకు షూటౌట్ కొనసాగే తరహాలోనే బిగ్ బాష్ నిర్వాహకులు కొత్త రూల్‌ను రూపొందించారు. ముందుగా ఈ నిబంధనను పురుషుల, మహిళల బిగ్‌బాష్ లీగ్‌ల ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. లీగ్ దశలో సూపర్ ఓవర్ కూడా సమమైతే మాత్రం మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించి ఇరు జట్లకు సమంగా పాయింట్లు కేటాయిస్తారు.