సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా | Steve Waugh praises Sourav Ganguly | Sakshi
Sakshi News home page

సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా

Aug 6 2013 11:38 PM | Updated on Sep 1 2017 9:41 PM

సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా

సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా

భారత జట్టులో గంగూలీ 'గ్రేట్ కెప్టెన్' అని వ్యాఖ్యానించారు. భారత జట్టును గొప్ప జట్టుగా తీర్చిదిద్దిన ఘనత గంగూలీదేనని స్టీవ్ వా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును పటిష్టం తీర్చి దిద్దడంలో గంగూలీ పాత్ర అమోఘమని స్టీవ్ వా అన్నాడు. భారత జట్టులో గంగూలీ 'గ్రేట్ కెప్టెన్' అని వ్యాఖ్యానించారు. భారత జట్టును గొప్ప జట్టుగా తీర్చిదిద్దిన ఘనత గంగూలీదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిలలో ఎవరూ గొప్ప కెప్టెన్లు అని పోల్చమనగా 'ఇద్దరు మంచి కెప్టెన్లే' అని స్టీవ్ వా అన్నాడు. అయితే ఇద్దరు కూడి విభిన్నమైన కెప్టెన్లు అని తెలిపాడు. ప్రస్తుత జరుగుతున్న యాషెస్ సిరీస్ లో  ఓ అద్బుతమైన ఫలితాలు వస్తాయని అన్నాడు. ఒకవేళ 2-2 తో సిరీస్ సమానమైతే ఇరు జట్లకు కఠిన పరీక్షగా మారవచ్చు అని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న మైఖెల్ క్లార్క్ కు స్టీవ్ వా బాసటగా నిలిచాడు. ఆసీస్ జట్టులో యువకుల టాలెంట్ కు కొరత లేదని, త్వరలోనే అద్బుతమైన జట్టుగా అవతరిస్తుందని.. అందుకు కొంత సమయం పడుతుంది అని అన్నాడు. 
 
కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవాసంస్థ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో స్టీవ్ మాట్లాడారు. కోల్ కతాకు 25 కిల్లో మీటర్ల దూరంలో ఉన్న బరాక్ పూర్ లోని ఉదయన్ నిర్వహణలో స్టీవ్ వా ప్రధాన నిర్వహకుడిగా సేవలందిస్తున్నారు. ఉదయన్ పిల్లలు స్టీవ్ వాను స్టీవ్ దా లేదా స్టీవ్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1998 లో కొల్ కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఉదయన్ కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉదయన్ కు తన సోదరుడు మార్క్, కుటుంబంతో కలిసి ఉదయన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement