దాల్మియాను కలిసిన శ్రీనివాసన్ | srinivasan met dalmia | Sakshi
Sakshi News home page

దాల్మియాను కలిసిన శ్రీనివాసన్

Oct 27 2014 1:25 AM | Updated on Sep 2 2017 3:25 PM

దాల్మియాను కలిసిన శ్రీనివాసన్

దాల్మియాను కలిసిన శ్రీనివాసన్

కోల్‌కతా: ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను మర్యాదపూర్వకంగా కలిశారు.

కోల్‌కతా: ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘క్యాబ్’ అనుబంధ యూనిట్లకు చెందిన 103 మంది సభ్యులు శ్రీనివాసన్‌ను సన్మానించారు. దాల్మియా ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఇందులో ప్రత్యేకంగా చూడాల్సింది ఏమీ లేదు. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ అయ్యాక దాల్మియాను తొలిసారి కలిశారు. అందుకే మా సభ్యులు కూడా సత్కరించారు’ అని క్యాబ్ సభ్యుడొకరు వెల్లడించారు.

అనంతరం ‘క్యాబ్’ కోశాధికారి బిస్వరూప్ డే ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రెఫ్యూజ్’ అనే ఎన్జీఓను ఐసీసీ చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత హోదాలో శ్రీనివాసన్ ఎన్జీవోకు రూ. 1 కోటి విరాళంగా అందజేశారు. మరోవైపు భారత సిరీస్‌నుంచి విండీస్ వైదొలగిన వ్యవహారంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement