చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల | sri lanka 175/8 | Sakshi
Sakshi News home page

చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల

Aug 30 2015 3:09 PM | Updated on Sep 3 2017 8:25 AM

చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల

చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల

మూడో టెస్టులో టీవిరామానికి 175 రన్స్ చేసిన శ్రీలంక

కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక టాపార్డర్ కుప్పకూలింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం టీ విరామ సమయానికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 175 రన్స్  చేసింది. హెరాత్ 47 పరుగులు, ప్రసాద్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇషాంత్ నాలుగు, బిన్నీ రెండు, ఉమేష్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.

లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్ రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement