సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్ | Singles runner-up Jaiswal varuni | Sakshi
Sakshi News home page

సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్

Dec 28 2014 1:17 AM | Updated on Sep 2 2017 6:50 PM

సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్

సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్

జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి వరుణి జైస్వాల్ రజత పతకాన్ని సాధించింది.

జాతీయ సబ్ జూ॥క్యాడెట్ టీటీ టోర్నీ
సాక్షి, రాజమండ్రి: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి వరుణి జైస్వాల్ రజత పతకాన్ని సాధించింది. శనివారం ముగిసిన ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన వరుణి సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరుణి 13-11, 13-11, 7-11, 6-11, 4-11, 8-11తో అర్చన (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడింది. సెమీఫైనల్లో వరుణి 11-5, 11-7, 11-5, 11-7తో అనూష (మధ్యప్రదేశ్)పై, క్వార్టర్ ఫైనల్లో 11-5, 11-4, 7-11, 13-11తో ప్రియాంక (రాజస్థాన్)పై గెలిచింది.

సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో మానవ్ (పీఎస్‌పీబీ ‘ఎ’) విజేతగా నిలిచాడు. ఫైనల్లో మానవ్ 11-9, 15-13, 10-12, 11-4, 11-13, 11-9తో పార్థ్ (ఢిల్లీ)పై గెలిచాడు. క్యాడెట్ బాల,బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో జీహో (పీఎస్‌పీబీ ‘ఎ’) 10-12, 11-9, 11-6, 8-11, 11-4, 8-11, 12-10తో అల్బెర్టో (పీఎస్‌పీబీ ‘ఎ’)పై; వన్షిక 11-6, 8-11, 11-8, 11-8, 14-16, 12-10తో దియా (మహారాష్ట్ర ‘ఎ’)పై నెగ్గారు.

Advertisement
 
Advertisement
Advertisement