క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌ | Sindhu, Prannoy enter quarterfinals of Indonesia Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

Jul 5 2018 3:39 PM | Updated on Jul 5 2018 3:58 PM

Sindhu, Prannoy enter quarterfinals of Indonesia Open  - Sakshi

జకార్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో సింధు 21-17, 21-14  తేడాతో అయా ఒహొరి(జపాన్‌)పై విజయం సాధించి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.  మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్‌ లో విజయం సాధించారు. క్వార్టర్స్‌లో సింధు..థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌ ఒన్‌గ్బారుంగ్‌ఫాన్‌తో కానీ చైనాకు చెందిన బింగ్జియాతో కానీ తలపడనుంది.

కాగా, పురుషుల సింగిల్స్‌ లో భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్‌లో ప్రణయ్‌ 21-23, 21-15, 21-13 తేడాతో వాంగ్‌ జు వుయ్‌(చైనా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. తొలి గేమ్‌నును కోల్పోయిన ప్రణయ్‌.. రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుని మ్యాచ్‌ను గెలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement