పాపం.. ధావన్‌! | Shikhar Dhawan Trolled For His Special Appearance During First T20 Match | Sakshi
Sakshi News home page

పాపం.. ధావన్‌!

Feb 25 2019 5:46 PM | Updated on Feb 25 2019 5:59 PM

Shikhar Dhawan Trolled For His Special Appearance During First T20 Match - Sakshi

ధోని, ఉమేశ్‌ యాదవ్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను కూడా వదల్లేదు.

ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్నంలో జరిగిన  తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలవడంతో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను కూడా వదల్లేదు. విశాఖ మ్యాచ్‌లో అతడు ఆడనందుకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మ్యాచ్‌ ముందు రోజు ట్విటర్‌లో ‘గబ్బర్‌’ పోస్ట్‌ చేసిన ఫొటోపై జోకులు పేల్చారు. ‘రేపటి మ్యాచ్‌కు సన్నద్ధం’ అంటూ ధావన్‌ పెట్టిన కామెంట్‌నూ వదల్లేదు. తర్వాత రోజు చూస్తే తొలి20లో అతడికి స్థానం దక్కలేదు. రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతేకాదు మ్యాచ్‌ మధ్యలో సహచరులకు బ్యాట్లు అందజేస్తూ ఫొటోలకు చిక్కాడు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. (ధావన్‌కు విశ్రాంతి.. మార్కండే అరంగేట్రం)

ముందురోజు ఇలా, తర్వాతి రోజు ఇలా అంటూ ధావన్‌ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. విశాఖ మ్యాచ్‌లో తనను తీసుకోనందుకు ధావన్‌ సంతోషపడివుంటాడని ఒకరు కామెంట్‌ చేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చివరి బంతికి కోహ్లి సేన పరాజయం పాలైంది. భారత్‌ ఓడిపోతుందని ముందే తెలిసి జట్టులోకి రాలేదా అంటూ మరొకరు వేళాకోళం ఆడారు. ఈరోజు జరిగిన దాంట్లో ధావన్‌ తప్పేంలేదని ఓ అభిమాని వెనకేసుకొచ్చారు. పాపం ధావన్‌ అంటూ మరికొందరు జాలి చూపించారు. (గెలుపు గోవిందా)

Advertisement
 
Advertisement
Advertisement