ధావన్‌కు విశ్రాంతి.. మార్కండే అరంగేట్రం

Mayank Markande are making His debut for India - Sakshi

విశాఖ: రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారు. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. కాగా, యువ క్రికెటర్‌ మయాంక్‌ మార్కండే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను పక్కకు పెట్టిన టీమిండియా యాజమాన్యం.. లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ మార్కండేను జట్టులోకి తీసుకుంది.

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్‌ సమంగా ముగిసింది.  ఆపై న్యూజిలాండ్‌తో జరిగిన పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ సిరీస్‌ను కోల్పోయింది. కాగా, ఈ సిరీస్‌ను ఇరు జట్లు వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనబడుతోంది.

భారత్‌ తుది జట్టు

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, మయాంక్‌ మార్కండే, యజ్వేంద్ర చహల్‌, బుమ్రా

ఆసీస్‌ తుది జట్టు

అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డీఆర్సీ షార్ట్‌, మార్కస్‌ స్టోనిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హ్యాండ్‌ స్కాంబ్‌, ఆస్టన్‌ టర్నర్‌, కౌల్టర్‌ నైల్‌, ప్యాట్‌ కమిన్స్‌, రిచర్డ్‌సన్‌, బెహ్రన్‌డార్ఫ్‌, ఆడమ్‌ జంపా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top