ఇండియా ‘ఎ’ జట్టులో శిఖర్‌ ధావన్‌  | Shikhar Dhawan Selected For Indian A Team | Sakshi
Sakshi News home page

ఇండియా ‘ఎ’ జట్టులో శిఖర్‌ ధావన్‌ 

Aug 31 2019 7:18 AM | Updated on Aug 31 2019 7:19 AM

Shikhar Dhawan Selected For Indian A Team - Sakshi

వెస్టిండీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో చివరి రెండు అనధికారిక వన్డేలలో తలపడే భారత ‘ఎ’ జట్టులోకి ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం శిఖర్‌ విండీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు. కుడి చేతి బొటన వేలి గాయంతో విజయ్‌ శంకర్‌ ‘ఎ’ సిరీస్‌కు దూరమయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement