‘వార్నీ’ మరో ప్రేమాయణం | Shane Warne confirms relationship with Australian Playboy model Emily Scott | Sakshi
Sakshi News home page

‘వార్నీ’ మరో ప్రేమాయణం

Jul 4 2014 1:37 AM | Updated on Sep 2 2017 9:46 AM

‘వార్నీ’ మరో ప్రేమాయణం

‘వార్నీ’ మరో ప్రేమాయణం

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిన ప్లేబాయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు.

 సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిన ప్లేబాయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వార్న్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
 
 గత నెలలో స్కాట్‌ను ముద్దాడుతూ అడ్డంగా బుక్కయిన వార్న్ ఈ వ్యవహారంపై కొద్ది కాలంగా మౌనంగా ఉన్నా.. చివరికి అంగీకరించాల్సి వచ్చింది. 2005లో భార్య సిమోన్‌కు విడాకులిచ్చిన తర్వాత వార్న్ బ్రిటిష్ మోడల్ లిజ్ హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు కలిసి మూడేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement