breaking news
Emily Scott
-
ప్లేబోయ్ మోడల్‌తో షేన్ వార్న్ డేటింగ్
ప్లేబోయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ప్రకటించాడు. గత నెలలో స్కాట్‌ను ముద్దాడుతూ కెమెరాలకు దొరికిపోయిన షేన్ వార్న్.. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా తన ప్రేమ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఆస్ట్రేలియాకే చెందిన టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ ఆడ చూసేందుకు వింబుల్డన్ వెళ్తున్న సందర్భంగా మళ్లీ అక్కడ మీడియా తమ వెంట పడకుండా ఉండాలనో .. ఏమో గానీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఎమిలీ స్కాట్‌తో కలిసి తిరుగుతున్నానని, ఆమె చాలా హాట్‌గా ఉందని చెప్పాడు. ఇటీవలి కాలంలో ఈ ప్రేమపక్షులిద్దరూ కలిసి లండన్‌లో చాలా ఈవెంట్లకు వెళ్లారు. ఇద్దరూ కలిసి ప్రేమికుల స్వర్గధామం అయిన ప్యారిస్‌కు కూడా వెళ్లారు. అక్కడ కొంతకాలం గడిపారు. ఆ విషయం షేన్ వార్న్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిసింది. నిజానికి నెలరోజుల క్రితం వరకు ఎలిజబెత్ హర్లీతో కలిసి తిరిగిన వార్న్.. తాను స్కాట్‌తో కలిసి తిరుగుతున్న విషయాన్ని ఖండించాడు కూడా. ఇప్పుడు ఎట్టకేలకు అంగీకరించాడు. అన్నట్లు.. స్కాట్ అమ్మడు డీజేగా కూడా పనిచేస్తోంది. Ps And yes I'm taking my girlfriend @EmilyLScott who's looking smoking hot too hahaha !!! — Shane Warne (@ShaneWarne) July 2, 2014 -
‘వార్నీ’ మరో ప్రేమాయణం
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిన ప్లేబాయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వార్న్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గత నెలలో స్కాట్‌ను ముద్దాడుతూ అడ్డంగా బుక్కయిన వార్న్ ఈ వ్యవహారంపై కొద్ది కాలంగా మౌనంగా ఉన్నా.. చివరికి అంగీకరించాల్సి వచ్చింది. 2005లో భార్య సిమోన్కు విడాకులిచ్చిన తర్వాత వార్న్ బ్రిటిష్ మోడల్ లిజ్ హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు కలిసి మూడేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు.