మెరిసిన సర్ఫరాజ్ | Sarfaraz Khan, Khaleel Ahmed power India to easy win over Pakistan in U-19 warm-up tie | Sakshi
Sakshi News home page

మెరిసిన సర్ఫరాజ్

Jan 26 2016 12:24 AM | Updated on Sep 3 2017 4:18 PM

అండర్-19 ప్రపంచకప్ కోసం భారత యువ ఆటగాళ్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

పాక్‌పై భారత్ విజయం  
అండర్-19 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్

 ఢాకా: అండర్-19 ప్రపంచకప్ కోసం భారత యువ ఆటగాళ్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (68 బంతుల్లో 81; 12 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా పాక్ 44.1 ఓవర్లలో 197 పరుగులు చేసింది. భారత పేసర్ ఖలీల్ అహ్మద్ (5/30) హడలెత్తించాడు. అనంతరం భారత్ 34 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెనడాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల ఆధిక్యంతో గెలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement