సెమీస్‌లో సానియా జంట | Sania Mirza-Peng Shuai advance on semis at Cincinnati Masters | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట

Aug 19 2017 1:01 AM | Updated on Sep 17 2017 5:40 PM

సెమీస్‌లో సానియా జంట

సెమీస్‌లో సానియా జంట

సిన్సినాటి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా–షుయె పెంగ్‌...

ఒహాయో: సిన్సినాటి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా–షుయె పెంగ్‌ (చైనా) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా–షుయె పెంగ్‌ జోడీ 6–3, 6–7 (1/7), 10–3తో ఇరీనా కామె లియా బేగూ–రలూకా ఒలారు (రొమేనియా) జంటపై విజయం సాధించింది.

మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయే షియా) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌లో బోపన్న–డోడిగ్‌ ద్వయం 5–7, 7–5, 10–8తో కబాల్‌ (కొలంబియా)–ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జోడీపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement