క్వార్టర్స్‌లో సానియా జంట | sania mirza couple enter to Quarter-final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Mar 13 2017 12:13 AM | Updated on Sep 5 2017 5:54 AM

క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట

మరో అలవోక విజయంతో ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ ...

కాలిఫోర్నియా: మరో అలవోక విజయంతో ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ సానియా–స్ట్రికోవా ద్వయం 6–2, 6–3తో సారా ఎరాని (ఇటలీ)–అలీసా రొసోల్‌స్కా (పోలాండ్‌) జోడీపై గెలిచింది.

64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–చెక్‌ జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. ఎరాని–రొసోల్‌స్కా జంట మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఆండ్రియా క్లెపాక్‌ (స్లొవేనియా)–మారియా జోస్‌ మార్టినెజ్‌ (స్పెయిన్‌); మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ)ల మధ్య జరిగే రెండో రౌండ్‌ మ్యాచ్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement