క్వార్టర్స్లో సానియా జోడీ | Sania-Martina in Sydney International quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో సానియా జోడీ

Jan 12 2016 8:03 PM | Updated on Sep 3 2017 3:33 PM

సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్వార్టర్స్లో ప్రవేశించింది.

సిడ్నీ: సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్వార్టర్స్లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) 6-2, 6-3 స్కోరుతో అనస్టాసియా రొడియోనోవా, అరినా రొడియోనోవాపై విజయం సాధించారు. సానియా, హింగిస్ జోడీకిది 27వ విజయం. క్వార్టర్స్లో సానియా ద్వయం చైనీస్ క్రీడాకారిణులు లియంగ్ చెన్, షువాయ్ పెంగ్తో తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement