స్వర్ణపోరులో సింధుపై సైనా విజయం | Saina Nehwal Clinches Gold In CWG | Sakshi
Sakshi News home page

స్వర్ణపోరులో సింధుపై సైనా విజయం

Apr 15 2018 8:17 AM | Updated on Apr 15 2018 9:43 AM

Saina Nehwal Clinches Gold In CWG - Sakshi

ఫైనల్‌లో విజయం తర్వాత సైనా నెహ్వాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ యాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో మరో స్వర్ణం భారత పతకాల పట్టికలో చేరింది. ఉత్కంఠభరిత ఫైనల్‌లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్‌ అద్భుత విజయం సాధించారు.

నువ్వా నేనా అంటూ సాగిన రెండు సెట్ల మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ సింధుపై 21-18, 23-21 తేడాతో విజయం సాధించారు. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆద్యంతం ఎటాకింగ్‌ గేమ్‌ను ఆడిన సైనా సింధుపై ఆధిపత్యం ప్రదర్శించడం గమనార్హం.

ఈ గోల్డ్‌తో భారత్ ఖాతాలో 26 స్వర్ణాలు చేరగా.. మొత్తం 64 పతకాలతో పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement