సెమీస్‌లో సాయిదేదీప్య | Sai Dedeepya Enters Semi Final Of AITA Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య

Aug 22 2019 9:57 AM | Updated on Aug 22 2019 9:57 AM

Sai Dedeepya Enters Semi Final Of AITA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సాయి దేదీప్య మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ ఫైనల్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–3, 6–3తో అవిష్క గుప్తా (జార్ఖండ్‌)పై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములతో దేదీప్య తలపడుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement