దాదాతో క్రికెట్‌ గాడ్‌.. ఫోటో వైరల్‌ | Sachin Shares A Throwback Photo With Ganguly Viral In Social Media | Sakshi
Sakshi News home page

పాత జ్ఞాపకాలను నెమరేసుకున్న సచిన్‌

May 15 2020 9:29 AM | Updated on May 15 2020 10:06 AM

Sachin Shares A Throwback Photo With Ganguly Viral In Social Media - Sakshi

హైదరాబాద్‌: భారత దిగ్గజ ఆటగాడు, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు, తన సహచర ఆటగాడు సౌరవ్‌ గంగూలీతో సచిన్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ సహచర క్రికెటర్లు అనటం కన్నా గొప్ప స్నేహితులు అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎన్ని రికార్డులు సాధించినా, ఎంత పెద్ద పదవులు అదిరోహించినా వీరిమధ్య ఉన్న స్నేహం ఏమాత్రం చెక్కుచెదర్లేదు. బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండి కూడా దాదా అనేకమార్లు సచిన్‌పై ఛలోక్తులు విసరగా అంతే విధంగా సచిన్‌ కూడా సరదాగా కౌంటర్‌ ఇచ్చేవాడు. 

ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు సచిన్‌. తన సహచర క్రికెటర్లతో సరదగా గడిపిన పాత మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్నాడు. తాజాగా గంగూలీ ఇంట్లో ఓ సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను సచిన్‌ షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వన్‌ మిలియన్‌ లైక్స్‌ను ఈ ఫోటో సాధించడం విశేషం. ఇక అందరూ వీరిద్దరి స్నేహం గురించి, వీరి గొప్పతనం గురించి నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ‘దాదాతో క్రికెట్‌ గాడ్’ అంటూ ఓ అభిమాని కామెంట్‌ చేశాడు.

చదవండి:‌   
ధోని దమ్మున్న సారథి 
సచిన్‌కు ‘స్పార్టన్‌’ క్షమాపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement