రోహిత్‌ ఫిట్‌: బీసీసీఐ | Rohit Sharma Fit For First T20 Match Against Bangladesh Says BCCI | Sakshi
Sakshi News home page

రోహిత్‌ ఫిట్‌: బీసీసీఐ

Nov 2 2019 1:34 AM | Updated on Nov 2 2019 1:34 AM

Rohit Sharma Fit For First T20 Match Against Bangladesh Says BCCI - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌గానే ఉన్నాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. శుక్రవారం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని ఉదర భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు విలవిలలాడిన రోహిత్‌ ప్రాక్టీస్‌ ఆపేసి అక్కడినుంచి నిష్క్రమించాడు. జట్టు ఫిజియో, వైద్యులు అతనికి చికిత్స అందజేశారు. అనంతరం వైద్యులు అతనికి అయిన గాయం సాధారణమైందేనని తేల్చారు. దీంతో తొలి టి20 మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో సంజూ సామ్సన్‌ పాల్గొనలేదు. రిషభ్‌ పంత్‌ చాలాసేపు చెమటోడ్చాడు. దీంతో తుదిజట్టులో పంత్‌కే అవకాశం దక్కనుంది. ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు ప్రాక్టీస్‌ సందర్భంగా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సలహాలిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement