తృటిలో సెంచరీ కోల్పోయిన రోజర్స్ | rogers loses century | Sakshi
Sakshi News home page

తృటిలో సెంచరీ కోల్పోయిన రోజర్స్

Jan 6 2015 8:55 AM | Updated on Sep 2 2017 7:19 PM

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ వెనువెంటనే రెండు కోల్పోయింది

సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోజర్స్(95) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (101) పరుగులు చేసి అవుట్ కావడం తెలిసిందే. 200 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్ మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించిన  రెండో వికెట్ ను నష్టపోయింది.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement