భారత్-బంగ్లాదేశ్ తొలివన్డేకు వర్షం ఆటంకం కలిగించింది.
మీర్పూర్: భారత్-బంగ్లాదేశ్ తొలివన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. 273 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఊతప్ప (50) హాఫ్ సెంచరీ చేశాడు. రహానె (46), పుజారా (0) క్రీజులో ఉన్నారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 272 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఉమేష్ మూడు, అమిత్, పర్వేజ్ రెండేసి వికెట్లు తీశారు. భారత పేసర్ ఉమేష్ ఆరంభంలోనే తమీమ్ ఇక్బాల్ (0), మోమినల్ హక్ (6) అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పట్టు సడలించారు. బంగ్లా బ్యాట్స్మెన్ అనామల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (59), షకీబల్ హసన్ (52), మహ్మదుల్లా (41) జట్టును ఆదుకున్నారు.