కోల్ కతా విజయ లక్ష్యం 161 | Rahane half century helps to take 160 runs | Sakshi
Sakshi News home page

కోల్ కతా విజయ లక్ష్యం 161

Apr 24 2016 9:31 PM | Updated on Sep 3 2017 10:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డు ప్లెసిస్(4) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు.

 

అనంతరం అజింక్యా రహానే(67;52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(31; 28 బంతుల్లో 2ఫోర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై పెరీరా(12), ఆల్బీ మోర్కెల్(16)లు విఫలమైనా, చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(23 నాటౌట్;12 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.


 

Advertisement
 
Advertisement
Advertisement