పతకం ఖాయం చేసుకున్న పివి సింధు | PV Sindhu assures India of bronze in World Championships | Sakshi
Sakshi News home page

పతకం ఖాయం చేసుకున్న పివి సింధు

Aug 9 2013 5:57 PM | Updated on Sep 1 2017 9:45 PM

పతకం ఖాయం చేసుకున్న పివి సింధు

పతకం ఖాయం చేసుకున్న పివి సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌లో తెలుగు అమ్మాయి పివి సింధు పతకం ఖాయం చేసుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌లో తెలుగు అమ్మాయి పివి సింధు పతకం ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ను 21-18, 21-17తో సింధు చిత్తు చేసింది. 55 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సైనా పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌ మహిళల సింగిల్స్ లో సెమీస్ చేరిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ప్రిక్వార్టర్స్లో ఏకంగా ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌ను కంగు తినిపించిన క్వార్టర్ ఫైనల్లోనూ సంచలనం నమోదు చేసింది. ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు 7వ ర్యాంకర్ షిజియాన్ వాంగ్ను మట్టికరిపించింది. మరోవైపు  సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement