breaking news
Parupalli Kasyap
-
జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ పారుపల్లి కశ్యప్.. ఆరో సీడ్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో 14- 21, 18- 21 తేడాతో ఓటమిచెందాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కశ్యప్ కు అవకాశం దక్కనీయకుండా చెన్ ధాటిగా ఆడాడు. ఈ పరాజయంతో భారత జట్టులోని ఏ ఒక్కరు కూడా కనీసం సెమీస్ కు చేరుకోకుండానే ఇంటిదారిపట్టినట్లయింది. ఈ సిరీస్ లో ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 4వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 12వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌లు ప్రిక్వార్టర్స్ దశలోనే పట్టగా, సింధు, గుత్తా జ్వాలా జోడి మొదటిరౌండ్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. -
పతకం ఖాయం చేసుకున్న పివి సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంయన్‌షిప్‌లో తెలుగు అమ్మాయి పివి సింధు పతకం ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్‌ను 21-18, 21-17తో సింధు చిత్తు చేసింది. 55 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంయన్‌షిప్ మహిళల సింగిల్స్ లో సెమీస్ చేరిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ప్రిక్వార్టర్స్‌లో ఏకంగా ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌ను కంగు తినిపించిన క్వార్టర్ ఫైనల్లోనూ సంచలనం నమోదు చేసింది. ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు 7వ ర్యాంకర్ షిజియాన్ వాంగ్‌ను మట్టికరిపించింది. మరోవైపు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో ముగిసిన సైనా, కశ్యప్ పోరాటం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడ సీడ్ సైనా నెహ్వాల్‌కు షాక్ తగిలింది. కొరియా ప్లేయర్ 13వ సీడ్ యియాన్ బెతో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 21-23, 9-21 తేడాతో సైనా చిత్తుగా ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో పోరాడి గెలిచిన స్ఫూర్తితో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సైనా.. మొదట్లో దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌లోనే ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్థి పుంజుకోవడంతో తడబడింది. తొలి గేమ్‌ను 21-23 తేడాతో ఓడింది. ఇక రెండో గేమ్‌లో యియాన్ బె మరింత దూకుడుగా ఆడటంతో.. సైనా ఎదురు నిలవలేకపోయింది. దీంతో 9-21 తేడాతో పరాజయం పాలైంది. అటు పురుషుల 13వ సీడ్ పారుపల్లి కశ్యప్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. మూడో సీడ్ డు పెంగ్యూతో జరిగిన మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు కశ్యప్ పోరాడి ఓడాడు. 21-16, 20-22, 15-21 తేడాతో కశ్యప్‌కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్ సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్‌లో కశ్యప్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరికి 20-22 తేడాతో గేమ్ కోల్పోయాడు. మూడో గేమ్‌లోనూ మొదట ఆధిక్యంలోకి దూసుకుపోయినా.. తర్వాత వెనకడుగు వేశాడు.