క్వార్టర్స్లో ముగిసిన సైనా, కశ్యప్ పోరాటం | Saina Nehwal, Parupalli Kasyap Crash Out from World Badminton Championships | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో ముగిసిన సైనా, కశ్యప్ పోరాటం

Aug 9 2013 2:14 PM | Updated on Sep 1 2017 9:45 PM

క్వార్టర్స్లో ముగిసిన సైనా, కశ్యప్ పోరాటం

క్వార్టర్స్లో ముగిసిన సైనా, కశ్యప్ పోరాటం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌ నుంచి హైదరాబాద్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ నిష్ర్కమించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మూడ సీడ్‌ సైనా నెహ్వాల్‌కు షాక్‌ తగిలింది. కొరియా ప్లేయర్‌ 13వ సీడ్‌ యియాన్‌ బెతో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో 21-23, 9-21 తేడాతో సైనా చిత్తుగా ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో పోరాడి గెలిచిన స్ఫూర్తితో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగిన సైనా.. మొదట్లో దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌లోనే ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్థి పుంజుకోవడంతో తడబడింది. తొలి గేమ్‌ను 21-23 తేడాతో ఓడింది. ఇక రెండో గేమ్‌లో యియాన్‌ బె మరింత దూకుడుగా ఆడటంతో.. సైనా ఎదురు నిలవలేకపోయింది. దీంతో 9-21 తేడాతో పరాజయం పాలైంది.

అటు పురుషుల 13వ సీడ్‌ పారుపల్లి కశ్యప్‌ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. మూడో సీడ్‌ డు పెంగ్యూతో జరిగిన మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు కశ్యప్ పోరాడి ఓడాడు‌. 21-16, 20-22, 15-21 తేడాతో కశ్యప్‌కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్‌ సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్‌లో కశ్యప్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరికి 20-22 తేడాతో గేమ్‌ కోల్పోయాడు. మూడో గేమ్‌లోనూ మొదట ఆధిక్యంలోకి దూసుకుపోయినా.. తర్వాత వెనకడుగు వేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement