జపాన్ ఓపెన్లో ముగిసిన భారత్ పోరు | indian team fight hasbeen end in japan super series badminton championship | Sakshi
Sakshi News home page

జపాన్ ఓపెన్లో ముగిసిన భారత్ పోరు

Sep 11 2015 10:50 AM | Updated on Sep 3 2017 9:12 AM

జపాన్ ఓపెన్లో ముగిసిన భారత్ పోరు

జపాన్ ఓపెన్లో ముగిసిన భారత్ పోరు

శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో పారుపల్లి కశ్యప్ ఓటమితో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది.

టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ పారుపల్లి కశ్యప్.. ఆరో సీడ్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో 14- 21, 18- 21 తేడాతో ఓటమిచెందాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కశ్యప్ కు అవకాశం దక్కనీయకుండా చెన్ ధాటిగా ఆడాడు.

ఈ పరాజయంతో భారత జట్టులోని ఏ ఒక్కరు కూడా కనీసం సెమీస్ కు చేరుకోకుండానే ఇంటిదారిపట్టినట్లయింది. ఈ సిరీస్ లో ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌, పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 4వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 12వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌లు ప్రిక్వార్టర్స్ దశలోనే పట్టగా, సింధు, గుత్తా జ్వాలా జోడి మొదటిరౌండ్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement