ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన | pune super giants won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన

May 17 2016 7:48 PM | Updated on Sep 4 2017 12:18 AM

డియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే అట్టడుగు స్థానంలో నిలిచి ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన పుణెకు ఈ మ్యాచ్ నామమాత్రం కాగా,  ఢిల్లీ డేర్ డెవిల్స్కు మాత్రం కీలకం.

ఇప్పటివరకూ 11 మ్యాచ్లాడిన ఢిల్లీ ఆరింట గెలిచి ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.  అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో పుణె విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), ఎస్ఎస్ ఐయ్యర్, డీకాక్, కేకే నాయర్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, జేపీ డుమినీ, క్రిస్ మోరిస్, కౌల్టర్ నైల్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ

పుణె తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, జార్జ్ బెయిలీ, సౌరభ్ తివారీ, ఇర్ఫాన్ పఠాన్, తిషారీ పెరీరీ, రవి చంద్రన్ అశ్విన్, అడమ్ జంపా, అశోక్ దిండా, దీపక్ చాహర్

Advertisement
 
Advertisement
Advertisement