బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన | pune super giants won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన

May 14 2016 7:43 PM | Updated on Sep 4 2017 12:06 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కోల్ కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కోల్ కతా 10 మ్యాచ్లాడి ఆరింట గెలవగా, పుణె 11 మ్యాచ్ల్లో మూడు మాత్రమే నెగ్గింది.


కోల్ కతా తుది జట్టు:గౌతం గంభీర్(కెప్టెన్), మనీష్ పాండే, రాబిన్ ఉతప్ప, సూర్యకుమార్ యాదవ్, షకిబుల్ హసన్, యూసఫ్ పఠాన్, ఆండ్రీ రస్సెల్, పీయూష్ చావ్లా, మోర్నీ మోర్కెల్, అంకిత్ రాజ్ పుత్, సునీల్ నరైన్

పుణె సూపర్ జెయింట్స్ తుది జట్టు:మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, జార్జ్ బెయిలీ, సౌరభ్ తివారీ, తిషారా పెరీరా, ఇర్ఫాన్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్, అడమ్ జంపా, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా

Advertisement
 
Advertisement
Advertisement