పుణె-కోల్ కతా మ్యాచ్కు వర్షం అడ్డంకి | pune super giants,Kolkata Knight Riders delayed by rain | Sakshi
Sakshi News home page

పుణె-కోల్ కతా మ్యాచ్కు వర్షం అడ్డంకి

May 14 2016 9:47 PM | Updated on Sep 4 2017 12:06 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు.

కోల్కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ గెలిచి పుణె బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.

 

మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పుణె 17.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(2), ఉస్మాన్ ఖాజా(21), జార్జ్ బెయిలీ(33), సౌరభ్ తివారీ(13), ఇర్ఫాన్ పఠాన్(7), తిషారా పెరీరా(13)లు పెవిలియన్ కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement