యు ముంబా గెలుపు | Pro Kabaddi u Mumba win | Sakshi
Sakshi News home page

యు ముంబా గెలుపు

Aug 31 2017 1:20 AM | Updated on Sep 12 2017 1:23 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 38–32 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది.

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 38–32 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ముంబా ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రైడింగ్‌లో ఇరు జట్లు 21 పాయింట్లు సాధించగా... టాకిల్‌లో ముంబా 14 పాయింట్లు చేస్తే, హర్యానా 7 పాయింట్లే చేయగలింది. ఇదే మ్యాచ్‌ను ప్రభావితం చేసింది.

ముంబా తరఫున అనూప్‌ 8, కుల్‌దీప్‌ 7 పాయింట్లు చేశారు. హర్యానా జట్టులో వికాస్‌ 9, వజీర్‌ సింగ్‌ 7, దీపక్‌ దహియా 5 పాయింట్లు సాధించారు. నేడు తమిళ్‌ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement