భారత్‌లో ఆడటానికి సిద్ధం | Prepare to play in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఆడటానికి సిద్ధం

May 11 2017 10:19 PM | Updated on Mar 23 2019 8:48 PM

భారత్‌లో ఆడటానికి సిద్ధం - Sakshi

భారత్‌లో ఆడటానికి సిద్ధం

చిరకాల ప్రత్యర్థి భారత్‌తో వారి సొంతగడ్డపై తాము ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు

పాక్‌ బోర్డు చీఫ్‌ షహర్యార్‌ ఖాన్‌

కరాచి: చిరకాల ప్రత్యర్థి భారత్‌తో వారి సొంతగడ్డపై తాము ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ షహర్యార్‌ ఖాన్‌ తెలిపారు. భద్రత పరమైన సమస్యలున్నప్పటికీ తమ జట్టును భారత్‌కు పంపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే భారత్‌ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రావడం లేదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే బోలేడంతా ఆదాయం సమకూరుతుందని, దీన్ని ఐసీసీ కూడా గుర్తించిందని తెలిపారు. నిజానికి 2017 డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సిరీస్‌లు జరగాల్సి ఉండగా.. 2008 ముంబై దాడుల అనంతరం దాయాది దేశంలో క్రీడ సంబంధాలను భారత్‌ తెంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కుదరిన ఎంఓయూను అమలు చేయాలని భారత్‌కు పీసీబీ నోటీసు కూడా పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే జూలైలో బంగ్లాదేశ్‌లో పాక్‌ పర్యటిస్తుందని షహర్యార్‌ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో పాక్‌ పర్యటించినా ఆదేశం పాక్‌లో పర్యటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బంగ్లా బోర్డు పర్యటన షెడ్యూల్‌ పంపడంతో ఆదేశానికి పాక్‌ జట్టును పంపడానికి పీసీబీ అంగీకారం తెలిపింది. మరోవైపు వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడోటెస్టు ద్వారా రిటైరవుతున్న దిగ్గజాలు యూనిస్‌ ఖాన్, మిస్వావుల్‌ హక్‌లను సత్కరించాలని పీసీబీ భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement