మలేసియా ఓపెన్‌: సింధు ఔట్‌ | P V Sindhu Crashes out of Malaysia Open | Sakshi
Sakshi News home page

మలేసియా ఓపెన్‌: సింధు ఔట్‌

Apr 4 2019 6:31 PM | Updated on Apr 4 2019 6:34 PM

 P V Sindhu Crashes out of Malaysia Open - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో భాగంగా రెండో రౌండ్‌లో సింధు 18-21, 7-21 తేడాతో  సుంగ్‌ జీ హ్యూన్‌( దక్షిణా కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో కనీసం పోరాటం చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా గేమ్‌తో మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు.

మరొవైపు పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌ పోరులో శ్రీకాంత్‌ 21-11, 21-15 తేడాతో  కొసిట్‌ ఫెట్‌ప్రదబ్‌ ( థాయ్‌లాండ్‌)పై గెలిచి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త కష్టపడి విజయం సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement