సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం: రోహిత్‌ శర్మ

ODI series will prepare India for 2019 World Cup, Rohit - Sakshi

నాటింగ్‌హామ్‌: ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ వచ్చే వరల్డ్‌ కప్‌కు సన్నాహకంగా పేర్కొన్నాడు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ. ఇంగ్లండ్‌లో ఎదురయ్యే కఠినమైన సవాళ్లను వన్డే సిరీస్‌ ద్వారా అధిగమించి మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతామని రోహిత్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై ఆ దేశంలో టీ 20 సిరీస్‌ను గెలిచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న తరుణంలో రోహిత్‌ మాట్లాడుతూ..‘ ఇంగ్లండ్‌ పటిష్టమైన జట్టు. ఆ జట్టుతో వారి గడ్డపై ఆడటం ద్వారా కొన్ని సవాళ్లను అధిగమించడంతో పాటు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.

ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోతున్న వన్డే సిరీస్‌ సన్నాహకం వంటిది. ఇంగ్లండ్‌ జట్టు మమ్మల్ని ఎంతవరకూ ఒత్తిడిలోకి నెడుతుందో చూడాలి. దాన్ని అధిగమించడానికి టీమిండియా సిద్ధంగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను గెలవడం మాకు అత్యంత ముఖ్యం. మా బలాబలాల్ని అర్థం చేసుకుని రాణించడానికి ప్రస్తుత సిరీస్‌ లాభిస్తుందనే అనుకుంటున్నా. మేము సమష్టిగా రాణిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టం కాదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టాస్‌ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంగ్లీష్‌ జట్టు నిర్దేశించే లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top