Ind VS SA: No disrespect for Shikar Dhawan, Says Tabraiz Shamsi on his Shoe Celebration
Sakshi News home page

‘ధావన్‌ను అగౌరవపరచలేదు’

Sep 26 2019 10:57 AM | Updated on Sep 26 2019 11:23 AM

No Disrespect For Shikhar Dhawan Tabraiz Shamsi - Sakshi

బెంగళూరు: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో విఫలమైన భారత్‌ ఓటమి  చెందింది. దాంతో సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. అయితే చివరి టీ20లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌ షమ్పీ తన షూతీసి సెలబ్రేట్‌ చేసుకోవడం చర్చనీయాంశమైంది.  సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ కావడంతో కొంతమంది అభిమానులు ధావన్‌ను షమ్సీ అవమానపరచాడంటూ ట్రోల్‌ చేశారు. దీనిపై షమ్పీ ట్వీటర్‌ వేదికగా స్పందించిన షమ్సీ.. తానేమీ ధావన్‌ను అగౌరవపరచలేదనే వివరణ ఇచ్చాడు.

‘ నేను ధావన్‌ను అవమానించలేదు. అది కేవలం గేమ్‌పై ప్రేమ, ఎంజాయ్‌ మెంట్‌,  వినోదం మాత్రమే’ అని తెలిపాడు. అయితే ధావన్‌తో ఫీల్డ్‌లో జరిగిన చిట్‌చాట్‌ను కూడా షమ్సీ పేర్కొన్నాడు. ‘నేను వేసిన తొలి రెండు బంతుల్ని నువ్వు ఎందుకు సిక్సర్లగా కొట్టలేదని అడిగాను. దానికి శిఖర్‌ ధావన్‌ నవ్వుతూనే సమాధానం చెప్పాడు’ అని అన్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌  చేసిన భారత్‌ 134 పరుగులు చేసింది. అందులో  ధావన్‌ 36  పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  కాగా, 135 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా సునాయాసంగా ఛేదించింది. కేవలం వికెట్‌ మాత్రమే  కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీకాక్‌ 52 బంతుల్లో అజేయంగా 79 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement