'ఇలాగైతే భారత్-పాక్ క్రికెట్ సిరీస్ ఉండదు' | No cricket ties with Pakistan as of now: BCCI | Sakshi
Sakshi News home page

'ఇలాగైతే భారత్-పాక్ క్రికెట్ సిరీస్ ఉండదు'

Jul 27 2015 7:08 PM | Updated on Sep 3 2017 6:16 AM

పంజాబ్లోని గురుదాస్ పూర్ ఉగ్రవాద దాడి ఘటన భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.

న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్ ఉగ్రవాద దాడి ఘటన భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణ సాధ్యంకాదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు రద్దయిన సంగతి తెలిసిందే. అయితే భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇటీవల ఇరు దేశాల బోర్డులు సుముఖత వ్యక్తం చేశాయి. భారత్-పాక్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని యోచించాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కష్టమని ఠాకూర్ చెప్పారు. ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపారు.

'క్రికెట్ సిరీస్ విషయం పీసీబీనే ప్రతిపాదించినా.. ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత్పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి. జమ్మూ ప్రాంతంతో పాటు పంజాబ్లోనూ ఉగ్రవాద దాడులు జరిగాయి. భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులను తీవ్రం ఖండిస్తున్నా. ప్రాణాలు ఎంతో విలువైనవి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడితే తప్ప క్రికెట్ సిరీస్ ఉండదు'అని ఠాకూరు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement