సానియాకు ప్రధాని మోదీ అభినందనలు | Narendra Modi congratulates Sania mirza for WTA Finals triumph | Sakshi
Sakshi News home page

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు

Oct 27 2014 10:25 AM | Updated on Aug 15 2018 2:20 PM

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు - Sakshi

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు

డబ్ల్యుటీఏ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

డబ్ల్యుటీఏ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ సందేశం పెట్టారు. ఇది చాలా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వెంటనే సానియా కూడా ఆయనకు సమాధానం పెట్టి.. కృతజ్ఞతలు తెలిపింది. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్తో కలిసి సానియా మీర్జా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఫైనల్ మ్యాచ్లో ఈ జంట తైపీ, చైనాలకు చెందిన సు వై సై, షుయ్ పెంగ్ జంటపై 6-1, 6-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కారా బ్లాక్తో జత కట్టినప్పటినుంచి సానియ డబుల్స్ ప్రతిభ కూడా బాగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఫైనల్ మ్యాచ్ని సానియా - కారా జంట ముగించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement