ముష్ఫికర్‌ రహీమ్‌ మరో ఘనత | Mushfiqur Rahim becomes second Bangladesh cricketer to reach 4,000 Test runs | Sakshi
Sakshi News home page

ముష్ఫికర్‌ రహీమ్‌ మరో ఘనత

Dec 1 2018 1:53 PM | Updated on Dec 1 2018 4:50 PM

Mushfiqur Rahim becomes second Bangladesh cricketer to reach 4,000 Test runs - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ మరో ఘనతను సాధించాడు. కొన్ని రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన రహీమ్‌.. రెండో డబుల్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టు ఫార్మాట్‌లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగువేల టెస్టు పరుగుల మైలురాయిని చేరాడు.

దాంతో ఈ ఘనత సాధించిన రెండో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రహీమ్‌ గుర్తింపు సాధించాడు. అంతకుముందు తమీమ్‌ ఇక్బాల్‌ ఒక్కడే నాలుగు వేల టెస్టు పరుగుల్ని సాధించిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ కాగా, ఇప్పుడు అతని సరసన రహీమ్‌ నిలిచాడు. విండీస్‌తో మ్యాచ్‌కు ముందు నాలుగు వేల పరుగులకు ఎనిమిది పరుగుల దూరంలో ఉన్న రహీమ్‌.. బిషూ  వేసిన 65 ఓవర్‌లో ఆ మార్కును చేరుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 14 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా పెవిలియన్‌ చేరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement