రోహిత్‌ శర్మ విఫలం | Mujeeb Takes Rohit Wicket | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ విఫలం

Jun 22 2019 3:26 PM | Updated on Jun 22 2019 3:32 PM

Mujeeb Takes Rohit Wicket - Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. కేవలం పరుగు మాత్రమే చేసిన రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత్‌ 7 పరుగుల వద్ద తొలి  వికెట్‌ను నష్టపోయింది. టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌లు ఆరంభించారు. కాగా, అఫ్గానిస్తాన్‌ తొలి ఓవర్‌ను స్పిన్‌తో ప్రారంభించింది. స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌తో అఫ్గాన్‌ మొదటి ఓవర్‌ను వేయించింది. అయితే ముజీబ్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 10 బంతులు ఆడిన రోహిత్‌ పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించిన రోహిత్‌.. అఫ్గాన్‌తో  మ్యాచ్‌లో విఫలం కావడం భారత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.


 

Advertisement
 
Advertisement
Advertisement